calender_icon.png 25 May, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం తడిసిన.. రైతులు నిరాశ చెందవద్దు

25-05-2025 05:01:00 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసిన, రైతులు నిరాశ చెందవద్దని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. ఈ మేరకు ఆదివారం ఖానాపూర్ మండలంలోని రాజుర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు భరోసా ఇచ్చారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే భరోసా మేరకు ప్రభుత్వం రైతును నష్టపరచకుండా తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తుందని వారు అన్నారు. దాంతో పాటు చాలినన్ని గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని, తూకం అయిన వడ్లను వెంటనే లారీలతో తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అద్వాల శంకర్, మాజీ సర్పంచ్ చిన్నం రవీందర్, మాజీ ఎంపీటీసీ సంజీవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ నిమ్యా, రాజేందర్, బీచ్ సింగ్, ఫారిత్, తదితరులు ఉన్నారు.