calender_icon.png 25 May, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిపెల్లి గ్రామంలో రోడ్డు భద్రతా కమిటీ ఏర్పాటు

25-05-2025 05:03:56 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రామకృష్ణాపూర్ పట్టణ రెండవ ఎస్సై లలిత(Second Sub-Inspector Lalita) ఆదివారం గుడిపెల్లి గ్రామంలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో గ్రామ పెద్దలను, యువకులను సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా రెండవ ఎస్సై మాట్లాడుతూ... వాహనదారులు ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటించాలని అన్నారు. వాహనదారులు హెల్మెట్ ను ధరించాలని సూచించారు. మద్యం సేవించి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై కొమురయ్య, సిబ్బంది జంగు, అంకయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.