calender_icon.png 25 May, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరు వర్గాల మధ్య ఘర్షణ..

25-05-2025 04:58:05 PM

యువకుడు మృతి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు మండలం చర్లపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణలో మాటేడు గ్రామానికి చెందిన ఎర్రం శివకుమార్(19) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. తొర్రూరు, ఫతేపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు, పోలేపల్లి, మాటేడుకు చెందిన కొందరు యువకులు ఈనెల 24న రాత్రి పరస్పరం ఘర్షణకు దిగి దాడులకు పాల్పడగా శివకుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మరణించినట్లు ఎస్ ఐ ఉపేందర్ తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని వద్దన్నపేట ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు.