29 June, 2026 | 12:17 PM

రైతులకు ఇబ్బందులు ఉండకూడదు

10-06-2025 01:03 AM
  1. నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి

కామారెడ్డి, జూన్ 9 (విజయ క్రాంతి), రైతులకు కర్రీ పండ విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు అవసరమైన, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. యూరియా, డిఎపి వంటి ఎరువుల కొరత రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జాయింట్ డైరెక్టర్ డైరెక్టతిరుమల ప్రసాద్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంతోష్ కుమార్, కామారెడ్డి నియోజకవర్గంలోని మండల వ్యవసాయ అధికారులు, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు

ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభం అయిన సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ అధికారులతో ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో  కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఈ రైతులకు ఖరీఫ్ పంటకి విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనీ, విత్తనాల కొరత ఏర్పడకూడదు అని  నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.