ప్రభాకర్‌రావు మామూలోడు కాదు
- పథకం ప్రకారమే లొంగిపోయాడు
- కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, జూన్ 9 (విజయక్రాంతి): ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు మామూలోడు కాదని, మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలోనే ప్రభాకర్‌రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సెలింగ్ తంతు పూర్తయిందని ఆరోపించారు.
పథకం ప్రకారమే లొంగిపోయి, విచారణకు హాజరయ్యారని, విచారణలో ప్రభాకర్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బహిరంగం చేయాలని డిమాండ్ చేశారు. నాతో పాటు, సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిన ఘనడు ప్రభాకర్‌రావు అని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమయ్యాయ ని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. భార్యాభర్తలు మాట్లా డుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీఛుడని ధ్వజమెత్తారు.
ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలని, ఫోన్ ట్యాపిం గ్ చేశాక వాటిని ఏం చేశారు? ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు? ఆడియోలను అడ్డుపెట్టుకొని ఎవరెవరిని బెదిరించారని ప్రశ్నించారు. కోర్టు నిబంధనలు అనుసరించి ప్రభాకర్‌రావును కఠినంగా శిక్షించా లని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. 18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో విచారణ కూడా ముందుకు సాగలేదని, ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలన్నారు. ప్రభాకర్‌రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనని బండి సంజయ్ కుమార్ తెలిపారు.






