18 April, 2026 | 12:09 AM

త్వరలో పసుపు బోర్డు కేంద్రం ప్రారంభం

10-06-2025 01:02 AM
  1. హాజరుకానున్న కేంద్ర మంత్రి అమిత్ షా

వెల్లడించిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): త్వరలోనే జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్‌లో ప్రారంభం కానుందని దాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రారంభిస్తారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసి తాను, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఆహ్వానించినట్లు వెల్లడించారు.

కార్యక్రమ సమయంలో బోర్డు అధికారిక లోగోను కూడా అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంతో పసుపు సాగుదారులకు దేశవ్యాప్తంగా అవకాశాలు విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పసుపు రైతులకు మేలు చేసే దిశగా, సహకార వ్యవస్థల శక్తిని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జూన్ నెలాఖరులో నిర్వహించనున్నట్లు ఎంపీ ప్రకటించారు.