3 June, 2026 | 1:47 AM

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

03-06-2026 12:00 AM

పీఏసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖర్

కందుకూరు, జూన్ 2 (విజయక్రాంతి): కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణతో పాటు పొద్దుతిరుగుడు (సన్ఫ్లవర్) కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ ఛైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, పాలకవర్గ సభ్యులు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. రైతులు మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ. 7,721/- పొందాలని సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ గోపాల్, ఎంపీడీవో బి. సరిత, డిప్యూటీ తహసిల్దార్ శేఖర్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు సురసాని సురేందర్ రెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి, పీఏసీఎస్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.