ప్రకృతి వ్యవసాయ రైతుకు దత్తాత్రేయ సన్మానం
03-06-2026 12:00 AM
ఘట్ కేసర్, జూన్ 2 (విజయక్రాంతి): ఘట్‌కేసర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ప్రకృతి వ్యవసాయ రైతు పిట్టల శ్రీశై లంను హర్యాన మాజీ గవర్నర్ బండారు ద త్తాత్రేయ ఘనంగా సన్మానించారు. అలాయి బలాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులను సత్కరించారు.
ఈకార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మల్కాజిగిరి ఎంపి ఊటల రాజెందర్, చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపి బూర నర్సయ్య, తెలంగాణ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కొదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, కప్పర ప్రసాదరావు, అలాయి బలాయి ఫౌండేషన్ కార్యదర్శి బండారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






