తూకం వేసిన జొన్నలు తరలించాలని రైతుల ధర్నా
బోథ్ . మే 20 (విజయ క్రాం తి) బజారత్నూర్ మండల కేంద్రం లో తూకం వేసిన ఏడు వేల జొన్న బస్తాలు ఎక్కడికి అక్కడే ఉన్నాయని వర్షంలో తడుస్తూ ఉన్న బస్తాలు వెంటనే తరలించాలని బజార్హత్నూర్ మండల కేంద్రంలో బుధవారం రైతులకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తూకం వేసిన బస్తాలు లారీలలో పంపకపోవడం వల్ల తాము వర్షంలో తడుస్తూ రాత్రిపూట పూకం వేసి ఉన్న బస్తాలకు కాపలా కాయాల్సి వస్తుందని రైతులు వాపోయారు.
లారీలు రాకపోవడం వల్ల భూకం వేసిన జొన్నల బస్తాలన్నీ అలాగే ఉండడం వల్ల తాము ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అని పేర్కొంటున్నారు. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు బైఠాయించారు. అనంతరం స్థానిక తాసిల్దార్ ఆఫీస్ లో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు కార్యక్రమంలో రైతులు దుబ్బల చంద్రశేఖర్ బంగారి రాములు తోకల ప్రభాకర్ రాజన్న తదితరులు ఉన్నారు






