21 May, 2026 | 2:13 AM

పారదర్శకంగా వెబ్ కౌన్సెలింగ్

21-05-2026 12:56 AM

మంచిర్యాల, మే 20 ( విజయక్రాంతి): సీనియర్ చార్జెంట్ (ఎలక్ట్రికల్), ఫోర్మెన్ ఇన్ఛార్జ్ (ఎలక్ట్రికల్) (ఎన్ డీ హెచ్) ఇంటర్ ఏరియా బదిలీలు, నూతనంగా ఎంపికైన చార్జెంట్ (ఎలక్ట్రికల్), టీ అండ్ ఎస్ గ్రేడ్- బీ పోస్టింగ్ ఎంపిక కోసం సింగరేణి సంస్థ బుధ వారం నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగింది. సంస్థ వ్యాప్తంగా ఉన్న ఖాళీల భర్తీ, బదిలీల కోసం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ లో శ్రీరాంపూర్ ఏరియా నుంచి ఏడుగురు,

మందమర్రి ఏరియా నుంకి ఐదు గురు, బెల్లంపల్లి ఏరియా నుంచి ఒకరు చొప్పున మొత్తం 13 మంది పాల్గొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ కు హాజరైన 12 మంది అభ్యర్థులలో ఐదుగురు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని తమకు అనుకూలమైన, అవకాశం ఉన్న ఏరియాలో పోస్టింగ్ ఎంచుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌ఓ టూ జీఎం సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, సీనియర్ పీఓ మురళి, ఐఈడీ ఇంజనీర్ సంగీత, సీనియర్ అసిస్టెంట్ నవీన్ లు పాల్గొన్నారు.