18-09-2025 06:44:36 PM
గూడెం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి..
తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన రైతులు..
చింతలమానేపల్లి (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు మండల కేంద్రంలోనీ అన్ని గ్రామ పంచాయతీల రైతులు కలిసి తక్షణమే యూరియా పంపిణీ చేయాలని, రైతుల కష్టాలను తొలగించాలని తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గూడెం రోడ్డు పనులు వెంటనే మరమ్మతులు చేయాలి డిమాండ్ చేశారు. రెండు నెలలు గడుస్తున్నప్పటికి చింతలమనెపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు నడవక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి వందే భారత్ రైలు వస్తుంది కని గూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు రాదా అని ప్రశ్నించారు. సమస్యను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు, నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డుబ్బులు వెంకన్న, నజిమ్ హుస్సేన్ ,డోకె రాజన్న, నిలగౌడ్ ,డొకె శ్రీను, అంజన్న, రైతులు, కోనేరు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.