18-09-2025 06:46:31 PM
రేగొండ (విజయక్రాంతి): మండలంలోని లింగాల, కనపర్తి గ్రామాలను జిల్లా అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి(District Additional Collector Vijayalakshmi) గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ రెండు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి, బతుకమ్మ ఉత్సవాలకు వీధి దీపాల ఏర్పాట్లు, పారిశుద్ధ్య నిర్వహణపై తగు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల యొక్క పనితీరు, మూల్యాంకనంపై రికార్డులను పరిశీలించి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు బతుకమ్మ ఉత్సవాలపై తీసుకోబోయే పనులపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యం. వెంకటేశ్వరరావు, ఎంపీఓ జి. రాంప్రసాద్ రావు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.