18-09-2025 06:41:30 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును నిర్మల్ జిల్లా ట్రస్మా సంఘంకి చెందిన సభ్యులు శ్రీ శ్యామ్ ప్రకాష్, ముజీబ్ కద్రి అందుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ వారిని ట్రస్మా సంఘం తరుపున సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షులు అబ్బాస్, స్టేట్ ఈసీ మెంబర్ షబ్బీర్ పాల్గొన్నారు.