12 June, 2026 | 2:30 AM

తెల్ల బంగారం సాగుకు రైతుల సై

12-06-2026 12:44 AM

ఈసారి తగ్గనున్న సోయ విస్తీర్ణం 

నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ పనులు సురు 

కుబీర్‌ జూన్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సోమవారం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం రైతులకు పోరాటనిచ్చింది. యాసంగి సీజన్ ముగించుకొని దిక్కులు దున్నుకొని పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న తరంలో సోమవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వర్షం కురిసింది. దీంతో రైతులు ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.

నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో మొత్తం 4.70 లక్షల ఎకరాల పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. నిర్మల్ జిల్లాలో 70% రైతులు వర్షా ఆధారంగా పంటలు పండించడం సాగునుడి బోర్లు చెరువులు ఎక్కువగా ఉండటంతో రైతులు నీటి వల్ల కింద పండే పంటలను ఎంపిక చేసుకుంటున్నాం. జిల్లాలో ప్రధానంగా పత్తి సోయా మొక్కజొన్న వారి పప్పు దినుసు పంటలతో పాటు కూరగాయ పంటలు సాగు చేస్తారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సీజన్ కు అవసరమయ్యే విత్తనాలు ఎరువులు సేకరించుకొని వర్షం కురవడంతో వాటిని విద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు 

తెల్ల బంగారం వైపు రైతుల చూపు 

నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంటలు పత్తి పంట వైఫై రైతులు ముగ్గు చూపే అవకాశం ఉంది. గత రెండు మూడు సంవత్సరాలుగా పత్తికి మార్కెట్లో డిమాండ్ ఉండడం ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో ఈసారి కూడా రైతులు పత్తి వైపే ముగ్గు చూపుతున్నారు.

జిల్లాలో ఒక్క లక్ష 60 వేల ఎకరాల వరకు పత్తి సాగు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు అందుకు తగిన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత వరి 1.60 లక్షల ఎకరాలు, సోయా 90 వేల ఎకరాలు పంట సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

పత్తి ప్రధానంగా బైంసా డివిజన్లోని కుబీర్ కుంటాల తానూరు లోకేశ్వరం ముధోల్ బాసర్ నిర్మల్ డివిజన్ లోని సారంగాపూర్ నర్సాపూర్ దిల్వార్పూర్ మండలాల్లో ఎక్కువగా సాగయ్య అవకాశం ఉంది. ఇక వరి నిర్మల్ డివిజన్లోని లక్ష్మణ్ చందా మామిడి కడెం ఖానాపూర్ సో న్ సారంగాపూర్, దిల్వార్పూర్ లోకేశ్వరం మండలంలో ఎక్కువగా సాగు చేయనున్నారు.. సోయపంట విషయానికి వస్తే ముధోల్ నిర్మల్ డివిజన్లో లక్ష ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెపుతున్నారు

వ్యవసాయ పనులు ప్రారంభం

మృగశిర కార్తి రోజే జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో రైతులు సోమవారం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు ప్రారంభించారు. పత్తి సోయా విత్తనాలు వేసుకోవడం కావలసిన ఎరువులు విత్తనాలు సేకరణ చేసుకోవడం వంటి పనులతో రైతులు కనిపించారు. రబి సీజన్లో రైతులు పండించిన వరి మొక్కజొన్న పంటలకు సంబంధించిన డబ్బులు రైతు ఖాతాలో జమ కాకపోవడంతో ఖరీఫ్ పెట్టుబడుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 

ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6000 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రకటించగా ఇప్పటివరకు కేవలం రెండు ఎకరాల పంట పెట్టుబడి 13000 మాత్రమే రైతు ఖాతాలో జమ చేసింది. మిగతా పెట్టుబడి అంచలవారీగా జమ చేస్తామని చెప్పిన అది జామ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో రైతుల పండించిన పంటకు సంబంధించిన డబ్బులు రాకపోగా ప్రభుత్వ పెట్టుబడి సాయం లేకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి పంట పెట్టుబడుల కోసం రుణాలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వం రైతులకు సంబంధించిన వరి మొక్కజొన్న పంటలకు సంబంధించిన దాన్ని డబ్బులను వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని వారు కోరుతున్నారు.