29 August, 2026 | 12:39 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

రైతు సంక్షేమమే ప్రధాని మోదీ లక్ష్యం

21-06-2026 12:00 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్  

జమ్మికుంట, జూన్ 20 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే ప్రధాని మోదీ లక్ష్యం అని, వ్యవసా య అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాని కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీచే వెస్ట్ బెంగాల్ హుగ్లీలోని తారకేశ్వర్ వేదికగా ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటగా  పీఎం కిసాన్ సమ్మా న్ నిధి పథకం కింద 23వ విడతగా జరిగే నిధుల విడుదల వీక్షించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిధిగా కేంద్ర మం త్రి బండి సంజయ్ కుమార్,అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, పీడీ ఆత్మ డైరెక్టర్ ఛత్రు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం పలు కీలక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఆ పథకాల్లో భాగంగానే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని  2019 ఫిబ్రవరిలో ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ నుంచి మోదీ ప్రారంభించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కేవీకే పరిపాటి విజయ్ గోపాల్ రెడ్డి , ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్.ఎన్ వెంకటేశ్వర్ రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, విజయ భారతి జిల్లా మత్స్య శాఖ అధికారి, జలకుమారి మున్సిపల్ చైర్మన్, మొలుగు ప్రశాంత్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్  పుల్లూరి స్వప్న సదానందం, జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్తల లతో పాటు రైతులు పాల్గొన్నారు.