21 June, 2026 | 1:31 AM

ఘనంగా యోగా దినోత్సవం

21-06-2026 12:01 AM
  1. నా ఆరోగ్యం నా బాధ్యత’ అనే పుస్తకావిష్కరణ..
  2. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఆరోగ్య అవగాహన పుస్తకం బహూకరణ..

ముషీరాబాద్, జూన్ 20(విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల  హైదరాబాద్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ’హెల్త్ ఈజ్ లైఫ్-మై హెల్త్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ’ అనే పుస్తకాన్ని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు బహూకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హాజరుకాగా, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆరోగ్యం, సంపూర్ణ శ్రేయస్సుపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించారు.

ఇందులో పోషకాహారం, శారీరక వ్యాయామం, నిద్ర, మానసిక ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం(గట్ హెల్త్), ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై సమగ్ర సమాచారం పొందుపరిచారు. జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ-2020) లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన ఈ పుస్తకం, చిన్న వయస్సు నుంచే విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకునేలా ప్రోత్సహిస్తుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే ’నా ఆరోగ్యం నా బాధ్యత’ అనే సందేశం ద్వారా వ్యక్తిగత ఆరోగ్య బాధ్యతపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశ మని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ  ఆరోగ్యవంతమైన భావి తరాల నిర్మాణానికి ఆరోగ్య విద్య, యోగా,  ముందస్తు ఆరోగ్య సంరక్షణ(ప్రివెంటివ్ హెల్త్కేర్) కీలకమని నొక్కిచెప్పారు.

ఏకాగ్రత ఆనందానికి మూలం యోగ:టీఎస్ పి ఏ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు...

రాజేంద్ర నగర్ జూన్ 20(విజయ క్రాంతి)ప్రతి ఒక్కరు జీవితంలో యోగాను ఒక భాగంగా  అలవర్చుకోవాలని యోగా తో  ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు శనివారంఅంతర్జాతీయ యోగా దినోత్సవం టీఎ స్పీఏ లో ఘనంగా జరుపుకున్నారుయోగ  ఆరోగ్యానికి, ఏకాగ్రతకు, ఆనందానికి మా ర్గం మార్గమన్నారు.తెలంగాణ పోలీస్ అకాడమీ ఫుట్బాల్ గ్రౌండ్లో భారీ స్థాయిలో యో గ మరియు ధ్యాన  కార్యక్రమం నిర్వహించారు.

అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్  చూచనల మేరకు ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీలు, ట్రైనీ ఎక్సైజ్ ఎస్‌ఐలు, వివిధ ఇన్-సర్వీస్ కోర్సుల శిక్షణార్థులు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇండోర్ మరి యు ఔట్డోర్ ఫ్యాకల్టీ సభ్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశా రు.యోగ శిక్షకుల ఆధ్వర్యంలో సాధన ఉద యం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు శ్రీనివాసన్, శ్రా వణ్ కుమార్, ప్రియాంక యోగా మరియు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించి, వివిధ యోగాసనాలు, శ్వాసాభ్యాసాలు, ధ్యా న విధానాలను అందరితో కలిసి సాధన చేయించారు.

ముఖ్య అతిథిగా టి ఎస్ పి ఎ  డిప్యూటీ డైరెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తున్న ఆయన యోగా అంశంపై ఒక పుస్తకాన్ని కూ డా రచించారు.‘30 సంవత్సరాలుగా యోగా సాధనను ఒక్కరోజు కూడా మానలేదు అని ఆయన పేర్కొన్నారు తన కుటుంబ సభ్యులను కూడా యోగా సాధకులుగా తీర్చి దిద్దానని తెలిపారు.

యోగ మరియు ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నా రు.పోలీస్ శాఖలో 24 గంటలూ ప్రజాసేవలో నిమగ్నమై ఉండే అధికారులు, సిబ్బం దికి యోగా ఎంతో ఉపయోగకరమన్నారు. క్రమశిక్షణతో యోగా సాధన చేస్తే వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చని తన ప్రదర్శన ద్వారా  డిప్యూటీ డైరెక్టర్ చాటి  చెప్పారు.ఈ కార్యక్రమం లో యోగ శిక్షకులకు డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు  తను రాసిన యోగ బుక్, తో పాటు అకాడమీ మెమెంటో బహుకరించి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు రాంబాబు, శ్రీనివాస రెడ్డి, భరత్, వేముల శ్రీనివాసరావు నరహరి, డీఎస్పీలు జ్ఞానేందర్ రెడ్డి,  సిబ్బంది పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. జంపన ప్రతాప్

సికింద్రాబాద్,జూన్ 20 (విజయ క్రాంతి) :శారీరక మానసిక అధ్యాత్మిక సాధన కలయికే యోగ అని కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. కంటోన్మెంట్ స్పోరట్స్‌అసోసియేషన్ ఆధ్వర్యం లో బోయిన పల్లి ప్లే గ్రౌండ్ లో యోగ డే పురష్కరించుకొని యోగ కార్యక్ర మంలో జంపన ప్రతాప్ పాల్గొన్నారు.యోగ లో సూ ర్యనమస్కారాలుముఖ్యమైంది.  ఈ కార్యక్రమంలో రేజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్, కరణ్ సింగ్,యాదగిరి, సురేష్, సత్యనారాయణ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.