12 June, 2026 | 1:31 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

25-02-2026 01:12 AM

గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 24: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధి కొహెడలో నిర్మించబోయే అంతర్జాయతీ స్థాయి  పండ్ల మార్కెట్ నిర్మాణానికి  మంత్రి మండలి ఆమోదం తెల్పడంతో పాలకవర్గం హర్షం వ్యక్తం చేస్తూ బాటసింగారం ఆఫీసు వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..కొహెడలో 239 ఎకరాలలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి అధికారికంగా ప్రభుత్వం ఆమోదం తెలపడం  శుభపరిణమన్నారు. మరోసారి రైతుల పక్షపాతిగా ప్రభుత్వం నిలిచిందన్నారు. గత ప్రభుత్వం  చేసిన తప్పిదాల కారణంగా రైతులు, వర్తకులు చాలా నష్టపోయారని అన్నారు. వీలైనంత త్వరలో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, అధికారులందరికీ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సీహెచ్, భాస్కర చారి,  డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి, డి. అంజయ్య, లక్ష్మి, బండి మధుసూదన్ రావు, గణేశ్ నాయక్, మచ్చేందర్ రెడ్డి, నర్సింహా , వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాస్, అధికారులు రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.