17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఏయూలో హ్యాకాట్రానిక్స్ 2.0 హ్యాకథాన్ ముగింపు

25-02-2026 01:14 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం  ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 36 గంటల హ్యాకట్రానిక్స్ 2.0 హ్యాకతాన్ ముగిసింది. ఈ హ్యాకతాన్ ను వి.ఎల్.ఎస్.ఐ , ఏఐ ఐఓటి, ట్రాక్ సాట్ , రోబోటిక్స్ విభాగాల్లో నిర్వహించగా వివిధ కళాశాలలకు చెందిన 396 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ముగింపు సభకు  సోకట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ విశ్వనాధ్ లింగ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

విశ్వనాధ్ లింగ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ హ్యాక్ తాన్ నందు బహుమతి గెలవడం ముఖ్యం కాదు అని హ్యాక్ తాన్ నందు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించిన ప్రతి విద్యార్థి విజేతే అని కొనియాడారు, హ్యాక్ తాన్ నందు గెలుపొందిన బృందములకు నగదు బహుమతి, ప్రశంసా పత్రంలను అందజేశారు. విశ్వవిద్యాలయం ఇటువంటి హ్యాక్తాన్ లతో  విద్యార్థులను ప్రోత్సహించడాన్ని  అభినందించారు.

ఈహ్యాక్తాన్ కు డాక్టర్ జయ సక్సేనా - సైంటిస్ట్ ఎఫ్, ఎన్.ఆర్.ఎస్.సి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈకార్యక్రమంలో డాక్టర్ వి.విజయకుమార్ -డీన్ ఎస్.ఓ.ఈ, ఈసీఈ హెచ్‌ఓడి ప్రోగ్రాం చైర్ డాక్టర్ హరికృష్ణ కమతం,  హ్యాకతాన్ కన్వీనర్లు డాక్టర్ ఎం. నారాయణ, డాక్టర్ ఎ. రాధిక, కోఆర్డినేటర్లు డాక్టర్ జి.రేణుక, ఎల్. ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.