28 August, 2026 | 4:03 PM

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

21-05-2024 02:06 AM

కరీంనగర్ సిటీ, మే 20: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలపై పట్టింపు కరువైందని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించలేకపోతున్నారని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కొత్తపల్లి మండలశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని, కోతలు విధించకుం డా మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

వేములవాడ ఆర్డీవోకి వినతిపత్రం..

రాజన్న సిరిసిల్ల, మే 20 (విజయక్రాంతి): కల్లాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని, తడిచిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, అర్బన్ మండల అధ్యక్షుడు చింతపల్లి వెంకటేశర రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోల కృష్ణ సామి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంటి మహేష్ పాల్గొన్నారు.