రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
21-05-2024 02:07 AM
రాజన్న సిరిసిల్ల, మే 20 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు శీఘ్రదర్శనం అమలు చేశారు. కోడె మొక్కులు చెల్లించకునే భక్తులు క్యూలైన్లలో 8 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. గుడిచెరువు మైదానం భక్తుల వాహనాలతో నిండిపోయింది. పట్టణంలోని శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది.






