calender_icon.png 11 November, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

11-11-2025 12:55:27 PM

బిఆర్ఎస్ నాయకుడు నాగం శశిధర్ రెడ్డి

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): అధిక వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిసరాల్లో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగం శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటలతో పాటు ఇతర పంటలు కూడా పూర్తిగా నష్టపోయాయని, రైతులు పెట్టుబడులతో పాటు అప్పులు చేసి సాగు చేసినా ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం కేవలం ఎన్నికలపై దృష్టి పెట్టకుండా, పంట నష్టాలను అంచనా వేసి తక్షణమే పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారితోపాటు బీఆర్ఎస్ నాయకులు అర్థం రవి, బాలగౌడ్, భీముడు, అహ్మద్ పాషా తదితరులు ఉన్నారు.