calender_icon.png 11 November, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గంధం వెదజల్లుతున్న.. అధికారుల పట్టింపేది?

11-11-2025 12:59:08 PM

ఇబ్రహీంపట్నం యూనియన్ బ్యాంక్ ముందు 20 రోజులుగా పొంగుతున్న డ్రైనేజీ

ఇబ్రహీంపట్నం: దుర్గంధం వెదజల్లుతున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ పరిధి, సాగర్ రహదారికి ఆనుకుని ఉన్న యూనియన్ బ్యాంక్ ముందు గత 20 రోజుల నుంచి అండర్‌ డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

మురుగునీరు పొంగుతున్న సమీపంలోనే ప్రధాన రహదారిలో బస్టాప్‌ కూడా ఉంది. కళాశాలలకు వచ్చే విద్యార్థులు, ప్రయాణికులు అటుగా వెళ్ళాలంటే ముక్కు మూసుకోక తప్పడంలేదనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.