21 July, 2026 | 7:27 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

వర్షం.. పంటలకు ప్రాణం

21-07-2026 03:47 PM

వాంకిడి,(విజయక్రాంతి): గత వారం రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో వాంకిడి మండల రైతులు ఆందోళన చెందారు. సోమవారం రాత్రి నుంచి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. మండలంలో అత్యధికంగా సుమారు 38 వేల ఎకరాల్లో పత్తి, 3 వేల ఎకరాల్లో కంది, వేయి ఎకరాల్లో పెసర, మిర్ప, వరి, సోయాబీన్ వంటి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. తాజాగా కురిసిన వర్షం పంట మొక్కలకు ప్రాణం పోసినట్ లైంది. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ప్రకటనతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి.