ఎమ్మెల్యేకు వినతి పత్రం
నిర్మల్,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిశీలించినందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆర్టీసీలో 38 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన 34,188 మంది ఉద్యోగులకు 2017, 2021 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ అందలేదని తెలిపారు.
పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఆలస్యం కావడంతో కుటుంబ పోషణ, వైద్య ఖర్చులు, ఇతర కనీస అవసరాలు తీర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.






