పార్టీ కోసం కష్టపడి పని చేయండి
నిర్మల్,(విజయక్రాంతి): దేశంలో సుస్థిర పాలన అందిస్తున్న మోడీ ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి చేర్చి పార్టీ కోసం కష్టపడి పని చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సోన్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు మండలంలోని అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు.






