15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం

20-02-2026 02:03 PM

కారు బైక్ ఢీ..ఒకరు మృతి.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కారు బైక్ ఎదురెదురుగా ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) వనపట్ల గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న గన్నోజు సురేష్ చారి (40) వృత్తి రీత్యా దారువాజా కొలతలు తీసుకునేందుకు తన బైక్ పై పెద్దకొత్తపల్లి వెళ్లి తిరిగి పట్టణానికి వస్తుండగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు నాగర్ కర్నూల్ నుండి సోమశిల వైపు కారులో వెళ్తున్న క్రమంలో కారు బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.