29 July, 2026 | 9:12 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

27-10-2024 02:23 AM

టైరు పేలి లారీ కిందకు దూసుకెళ్లిన కారు

ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి

అనంతపురం జిల్లా నాయనపల్లి క్రాస్ రోడ్డులో ఘటన

అనంతరం, అక్టోబర్ 26:  ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు లారీ కిందకు దూసుకెళ్లింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకేంద్రానికి చెందిన సంతోశ్ (26), షణ్ముఖ (30), వెంకన్న (35), ప్రసన్న (34), వెంకీ (24), శ్రీధర్ (28) ఇస్కాన్ టెంపుల్ భక్తులు. వీరు శనివారం తాడిపత్రిలో జరిగిన నగర సంకీర్తనకు కారులో వెళ్లారు. కార్యక్రమం తర్వాత ఆరుగురు కారులో అనంతపురం కడప నేషనల్ హైవేపై అనంతపురం వెళ్తున్నారు. వాహనం శింగనమల మండలంలోని నాయనపల్లి క్రాస్‌కు చేరుకోగానే టైర్ పేలి, అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సంతోశ్, షణ్ముఖ, వెంకన్న, ప్రసన్న, వెంకీ, శ్రీధర్ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్నిగంటల పాటు శ్రమించి కారులో ఇరుక్కుపోయిన ఆరుగురు మృతదేహాలను బయటకు తీయించారు. తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.