29 July, 2026 | 9:45 PM

Breaking News

బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •  

నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు

29-07-2026 09:04 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో బాబా ను దర్శించుకొని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సక్రమంగా కురవాలని పాడిపంటలు పండాలని ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని బాబాను వేడుకున్నట్లు ఎమ్మెల్యే పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి వ్యాపారవేత్త నాగులగామ వెంకన్న,నసురుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.