ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
29-07-2026 09:07 PM
ఎర్రుపాలెం,(విజయ క్రాంతి): మండలంలోని సాయిబాబా దేవాలయాలలో భక్తులు గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ చిన్న షిర్డీ సాయి మందిరంలో వేం చేసి ఉన్న శ్రీ చిన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా ను దర్శించుకుని దైవ కృపకు పాత్రులయ్యారు.






