29 July, 2026 | 9:39 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి

29-07-2026 09:01 PM

హుస్నాబాద్: హుస్నాబాద్ - హన్మకొండ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాధుల యాదలక్ష్మి (60) పని నిమిత్తం మల్లారం వెళ్లి తిరిగి వస్తూ పెట్రోల్ బంక్ సమీపంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందారు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది.