4 March, 2026 | 11:02 PM

అంత్యక్రియలకు వస్తూ అనంతలోకాలకు

04-03-2026 09:45 PM

మునగాల ఆకుపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మృతి – మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మొగలాయి కోటలో విషాదం... కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

కోదాడ,(విజయక్రాంతి): మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో ఎన్హెచ్-65 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం మొగలైకోట గ్రామానికి చెందిన కొండ్రు వంశీ, కిన్నెర దావీదు, వెంకటయ్య, రాజకుమార్ జీవనోపాధి కోసం హైదరాబాద్ పట్టణానికి వెళ్లారు. మొగలాయికోట గ్రామానికి చెందిన కిన్నెర పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో బుధవారం ఆయన అంత్యక్రియలను గ్రామంలో నిర్వహిస్తున్నారు.

ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నలుగురు హైదరాబాదు నుండి బయలుదేరారు. మరో కొద్ది నిమిషాలు అయితే స్వగ్రామం వెళ్లేవారు. ఈ క్రమంలో ఆకు పాముల వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కోండ్రు వంశీ (28), కిన్నెర దావీదు (22) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వెంకటయ్య, రాజకుమార్ తీవ్రంగా గాయపడగా వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.