08-12-2025 12:40:46 AM
-మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
-సంగారెడ్డి జిల్లా వెలిమల ఓఆర్‌ఆర్ వద్ద ఘటన
-దైవ దర్శనానికి తిరుపతి వెళ్తున్న మేడ్చల్‌వాసులు
-ఓఆర్‌ఆర్‌పై కారును ఢీకొట్టిన లారీ
అమీన్‌పూర్, డిసెంబర్ 7 (విజయక్రాంతి) :దైవ దర్శనానికి తిరుపతి వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తండ్రీ, కూతురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా వెలిమల ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ 2 వద్ద ఆదివారం రాత్రి జరిగింది.
భానూర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు మేడ్చల్ నుంచి శ్రీశైలం, అతని భార్య లక్ష్మీ, కూతురు సుదీక్షతో పాటు పరిచయస్తులైన జ్యోతిలక్ష్మీ, శాశిక, తిరుపతి, దువికలతో కలిసి కారులో తిరుపతికి బయలుదేరారు. వారు బయలుదేరిన కొద్దిసేప టికే ఓఆర్‌ఆర్ వెలిమల వద్ద ఎగ్జిట్ నంబర్ 2 వద్దకు రాగా పటాన్‌చెరు మార్గంలో వెళ్తున్న గుజరాత్‌కు చెందిన లారీ డ్రైవర్ కజోడ్ మాల్ బగారియా నిర్లక్ష్యం వల్ల వీరు కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీశైలం కూతురు సుదీక్ష అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ శ్రీశైలంను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్య లో మృతి చెందాడు.అలాగే కారులో ఉన్న లక్ష్మీ, తిరుపతి, జ్యోతి లక్ష్మీ, శాశిక, దువికలకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. వీరిని యశోద, పానేసియా మెరిడియన్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.