08-12-2025 12:40:31 AM
ప్రభుత్వ విప్ రామ చంద్రు నాయక్
మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తోందని, ఇందిరమ్మ ఇండ్లు, కొత్తగా రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం,
గృహ జ్యోతి ద్వారా పేద ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తోందని, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలకు సేవలు అందించే వారికే పట్టం కట్టాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ పిలుపునిచ్చారు.
ఆదివారం డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని దంతాలపల్లి మండలంలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యుల విజయానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉంటారని, వారికి అండగా నిలవాలని కోరారు.