calender_icon.png 10 December, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి ఈశ్వరాచారి త్యాగం వృథా పోదు

08-12-2025 12:42:10 AM

గౌలిగూడ విశ్వకర్మ స్వర్ణకార సొసైటీ నేతలు

హైదరాబాద్, డిసెంబర్ 7(విజయక్రాంతి): బీసీల రిజర్వేషన్ కోసం ఆత్మ బలి దానం చేసిన సాయి ఈశ్వరాచారి త్యాగం వృథా పోదని గౌలిగూడ విశ్వకర్మ స్వర్ణకార సొసైటీ అధ్యక్షుడు ఏ హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఎన్ సంతోష్ కుమార్ చారి, ఉపాధ్యక్షుడు సి జగన్ చారిలు పేర్కొన్నారు.

ఈ మేరకు ఆదివారం బీసీ రిజర్వేషన్ల సాధ న కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వరాచారి సంతాప సభ నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మల మరో బలిదానం మళ్లీ విడత తెలంగా ణ కోసం శ్రీకాంత్‌చారి, బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వరాచారి సమాజానికి ఎప్పుడు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అనంతరం సర్వ స్వర్ణకార వ్యాపారులందరూ, కొవ్వొత్తులు వెలిగించి సాయి ఈశ్వరాచారికి  ఘనంగా నివా ళులర్పించా రు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సి జగన్ చారి, కోశాధికారి ఈ భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రామకృష్ణ చారి, సంఘటిత కార్యదర్శి సీహెచ్ ప్రదీప్ కుమార్ చారి, కార్యదర్శి సిరిపురం నరసింహ చారి, శ్రీనివాస్, కే రాజశేఖర్‌చారి, ఏం రఘుచారి, గౌలికూడా మార్కెట్ సభ్యులు పాల్గొన్నారు.