11 July, 2026 | 9:37 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి..

22-04-2025 05:02 PM

భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన..

చిట్యాల/రేగొండ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాకపల్లి గ్రామంలో తండ్రి కొడుకును కొట్టి చంపిన దారుణ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. రేపాకపల్లె గ్రామానికి చెందిన కాసం మొండయ్య తన కొడుకు ఓదెలుకు సోమవారం రాత్రి ఘర్షణ జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఓదెలు తలపై మంగళవారం ఉదయం తండ్రి మొండయ్య కర్రతో  కొట్టగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. ఇరువురి మధ్య ఘర్షణ కారణంగానే కన్న కొడుకును తండ్రి కొట్టి హత్య చేసినట్లు భావిస్తున్నారు. కొడుకును హత్య చేసిన తండ్రి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.