11 July, 2026 | 10:15 PM

బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ

11-07-2026 09:19 PM

రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో గుర్తుతెలియని దుండగులు రైతుల వ్యవసాయ పంపుసెట్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వద్ద అమర్చిన సుమారు 20 పంపుసెట్ల సర్వీస్ విద్యుత్ కేబుళ్లను రాత్రి వేళల్లో అపహరించినట్లు రైతులు తెలిపారు.

ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు పంపుసెట్లకు విద్యుత్ కేబుళ్లు లేకపోవడంతో చోరీ జరిగిన విషయం గుర్తించారు. దీంతో సాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వరుసగా వ్యవసాయ పరికరాల చోరీలు జరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ పరిసరాల్లో రాత్రిపూట పోలీసు గస్తీని పెంచాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.