11 July, 2026 | 10:37 PM

కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

11-07-2026 09:22 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మిర్యాల్ కార్ బాలాజీ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి పండ్లు అందజేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల నాయకులు,బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.