calender_icon.png 15 October, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య

15-10-2025 10:46:30 AM

కోనసీమ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా(Konaseema district) ఆలమూరు మండలం చిలకలపాడులో దారణం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి ఉరివేసుకుని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు పావులూరి కామరాజు(35), అభిరామ్(10), గౌతమ్(07)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.