15-10-2025 11:00:31 AM
గుంటూరు: రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం జరిగిన దారణ సంఘటన గుంటూరు-పెదకూరపాడు స్టేషన్ల(Guntur-Pedakurapadu Station) మధ్య చోటుచేసుకుంది. బోగీలో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిని కత్తితో బెదిరించిన ఆగంతకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి నగదు, సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ లాక్కొని పారిపోయాడు. దీంతో బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నడికుడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసుల తెలిపారు.