calender_icon.png 15 October, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నామినేషన్ వేయనున్న మాగంటి సునీత

15-10-2025 10:07:42 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో(Jubilee Hills by-election) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతా గోపీనాథ్‌కు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు మంగళవారం బీ-ఫారమ్‌ను అందజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్(Maganti Sunitha) షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ భవన్ నుండి షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు. మాగంటి సునీత నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప‌ద్మారావు గౌడ్, కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. 

నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరే ముందు కేటీఆర్(KTR), పార్టీ సీనియర్ నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీ-ఫారంతో పాటు, బీఆర్ఎస్ చీఫ్ ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరపున రూ.40 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో దివంగత మాగంటి గోపీనాథ్ కుమార్తె, కుమారుడు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముత్త గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్ రావు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ 19న మాగంటి సునీతకు మద్దతుగా భారీ ర్యాలీని చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.