పల్లెల్లో ‘శునక’ భయం..!
- సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న వీధి కుక్కలు
- జిల్లాలో 20వేలకు పైగా శునకాలు
- మూలనపడ్డ సంతాన నిరోధక శస్త్రచికిత్సల కార్యక్రమం
- గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ లోపం
సంగారెడ్డి, జూన్ 9(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల ఉధృతి తీవ్రరూపం దాల్చింది. పట్టణాలు, గ్రామాలు అ నే తేడా లేకుండా శునకాలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఝరాసంగం, కొండాపూర్ తదితర మండలాల్లో వరుసగా జరిగిన క్రూరమైన దాడులు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపాయి. జిల్లాలో వీధి కుక్కల స్త్వ్రరవిహారం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఎక్కడి నుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తాయో తెలియని భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వృద్ధులు, మహిళలు, ము ఖ్యంగా చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు.
నిత్యం జిల్లాలో ఏదో ఒక మూల కు క్కల దాడుల ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. జిల్లాలోని ఝరా సంగం మం డలం తుమ్మన్పల్లి గ్రామంలో ఒకే రోజు పి చ్చికుక్క విచక్షణారహితంగా దాడి చేసి రిజ్వానా బేగం, చంటయ్య, యేసయ్య, విష్ణువర్ధన్రెడ్డిని తీవ్రంగా గాయపరిచింది. బాధితు లను అత్యవసర చికిత్స కోసం హైదరాబా ద్కు తరలించాల్సి వచ్చిం ది. కొండాపూర్ మండలం మల్కాపూర్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళపై వెనుక నుం చి వచ్చిన కుక్క అకస్మాత్తుగా దాడి చేసి నా లుగు చోట్ల క్రూరంగా కరిచింది.
ఆమె రా యి తీసుకుని ఎదురు తిరగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డై వైరల్గా మారాయి. దౌల్తాబాద్లో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై ఏకంగా 14 కుక్కలు ఒకేసారి దాడి చేసి రక్తం ఓడేలా కరిచాయి. స్థానిక మహిళ సకాలంలో స్పందించి తరిమేయడంతో బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
జిల్లాలో 20 వేలు దాటిన శునకాలు..
గత పశుగణన రికార్డుల ప్రకారం జిల్లా లో అధికారికంగా 13,486 కుక్కలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 20 వేలకు పైగా చేరినట్లు అంచనా. జహీరాబాద్, నారాయణ ఖేడ్, సంగారెడ్డి, ఆందోల్ పరిధిలోని మండలాల్లో వీటి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారులపై గుంపులుగా చేరుతున్న కుక్కలు రాత్రి వేళల్లో ద్విచక్ర వాహ న దారులను వెంబడిస్తూ కిందపడేసి తీవ్ర గా యాలపాలు చేస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల శివార్లలోని చికెన్, మటన్ సెంటర్ల ని ర్వాహకులు వ్యర్థాలను రోడ్ల పక్కనే పారేస్తున్నారు. ఈ రక్తం, మాంసం తింటున్న కుక్క లు మరింత క్రూరంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత, ఉక్కపోత కారణం గా కుక్క ల్లో చిరాకు పెరిగి, చిన్న శబ్దాలకూ ఉలిక్కిపడి మనుషులపైకి లంఘిస్తున్నాయి.
వ్యర్థాల నిర్వహణ లోపం..
గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డు ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో, ఆహారం కోసం కుక్కలు జనావాసాలపై పడుతున్నా యి. కుక్కల నియంత్రణకు గాను స్థానిక సం స్థలు అమలు చేయాల్సిన సంతాన నిరోధక శస్త్రచికిత్సల కార్యక్రమం జిల్లాలో నా మమాత్రంగా సాగుతోంది. కుక్కలకు యాం టీ- రేబిస్ వ్యాక్సిన్లు వేయడంలో వెటర్నరీ, ము న్సిపల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో కనీసం పిచ్చి కుక్కలను గుర్తించి వాటిని ఐసోలేట్ చేసే ప్రత్యేక బృందాలు కరువయ్యాయి.
రేబిస్ భయం.. ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు ఉన్నాయా?
కుక్క కరిచిన వెంటనే వేయాల్సిన యాం టీ రేబిస్ వ్యాక్సిన్ లు, ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి. కా నీ క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులో లేవని తెలుస్తోంది. గ్రామీణ ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికారు లు స్పందించి వ్యాక్సిన్ నిల్వలను పెంచాలి.






