5 June, 2026 | 1:15 AM

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి

05-06-2026 12:00 AM

డీఈవోకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వినతి 

శేరిలింగంపల్లి, జూన్ 4 (విజయక్రాంతి):జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యకు సంభందించి ఆదేశాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే  జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా నెత్రుత్వంలోని బృందం జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లు లను కోరింది. ఈ మేరకు గురువారం నాడు రంగారెడ్డి జిల్లా లోని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.మన జిల్లాలోని వివిధ  ఏలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రయివేటు పాఠశాలలో పిల్లల చదువులకు ఫీజులు భారంగా మారాయాని, జర్నలిస్టుల స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఉచితంగా విధ్యను అందించేలా ఉత్తర్వులు ఇవ్వగలరని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు పాండు యాదవ్, కోశాధికారి శశిపాల్ రెడ్డి, కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, ఇలియాజ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ జర్నలిస్ట్ నేతలు బాలు, భాస్కర్, శ్రీనివాస్, భార్గవ్,మహేందర్,చాట్ల సురేందర్,గిరి,షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు ఫణింద్ర, శేరిలింగంపల్లి నేతలు నరేష్, మహేందర్, యాసీన్, బస్వారాజ్, తదితరులు పాల్గొన్నారు.