26 May, 2026 | 1:54 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

26-05-2026 12:26 AM

ముషీరాబాద్, మే 25 (విజయక్రాంతి): తెలంగాణలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ వారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తెలంగాణ సచివాలయంలో కలిసి వివిధ బీసీ సమస్యలపై నివేదిక సమర్పించారు.

ఈ సందర్భంగా అనంతరం మీడియాతో గుజ్జ సత్యం మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయడం, హల్‌టి కెట్లు ఇవ్వడంలో జాప్యం, విద్యా ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ప్రతినిధుల బృందం లో బీసీ జేఏసీ మహిళా నాయకురాలు మట్టా జయంతి గౌడ్, కామారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు శంకరయ్య, గంగపుత్ర సంఘం రాష్ట్ర నాయకులు అశోక్, నవీన్, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు.