10 August, 2026 | 8:45 PM

Breaking News

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

10-08-2026 07:39 PM

బీజేపీ సీనియర్‌ నాయకుడు అరిగెల నాగేశ్వరరావు

డీఎంహెచ్‌ఓ డా. నాగేంద్రకు సన్మానం

ఆసిఫాబాద్‌,(విజయక్రాంతి): జిల్లా వైద్య అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా. నాగేంద్రను సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ నాయకులు అరిగెల నాగేశ్వరరావు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అరిగెల నాగేశ్వరరావు మాట్లాడుతూ... జిల్లాలోని మారుమూల ప్రాంతంలో జన్మించి, ఇదే జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రస్తుతం జిల్లా వైద్య అధికారిగా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టి, జిల్లా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.