10 August, 2026 | 8:49 PM

Breaking News

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసన   •   సంజయ్‌ని కలిసిన బిజెపి జిల్లా అధ్యక్షులు   •   ఆలేరు నూతన ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్‌కు ఘన సన్మానం   •   రామప్ప సరస్సు నీటితో గణపసముద్రం నింపండి   •   మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తల్లికి పద్మాదేవేందర్‌రెడ్డి నివాళి   •   ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ నాయకుడు ఆఫ్రిద్‌ను పరామర్శించిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి   •   నిండు కుండగా మారిన ఎల్లయ్య చెరువు   •   తుంగతుర్తి పీఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులుగా పోతురాజు, బాణాల   •   దేశభక్తితో హర్ ఘర్ తిరంగా   •   కుంటుపడిన గూడెం అభివృద్ధిని గాడిలో పెట్టింది సిపిఐనే   •  

అభివృద్ధి పనుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

10-08-2026 07:42 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలో అభివృద్ధి పనుల నిర్వహణలో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని బోధన్ టౌన్-1 ఏఈ నాయిని కృష్ణ తెలిపారు. షర్బతి కెనాల్, సరస్వతి నగర్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా, శివాలయం టెంపుల్ ఏరియా, ఓల్డ్ బస్టాండ్, మార్కెట్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, కోర్టు ఏరియా, విశ్వేశ్వరయ్య పార్క్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.