బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించిన ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ సైదమ్మ, కానిస్టేబుల్ సతీష్ నాయుడుకు శుక్రవారం ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సిబ్బందితో కలిసి స్టేషన్ ఆవరణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సైదమ్మ మరియు సతీష్ నాయుడు తమ విధి నిర్వహణలో క్రమశిక్షణ అంకిత భావం, ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో పనిచేశారని పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని అన్నారు. భవిష్యత్తులో కూడా తమ సేవలను ఇదే నిబద్ధతతో కొనసాగించి మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బంది వారిని శాలవాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తోటి ఉద్యోగులు వారి సేవలను స్మరించుకుంటూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు.






