1 August, 2026 | 1:55 AM

వానలు కురిస్తే రాకపోకలు బందే

01-08-2026 01:04 AM

ప్రాణాలకు తెగించి ప్రయాణం 

ఆదివాసి గూడెలకు అందని రవాణ సదుపాయం 

గర్భిణీలకు పిల్లలకు తప్పని పాట్లు 

ఖానాపూర్ జూలై31 (విజయక్రాంతి): భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న నిర్మల్ జిల్లాలోని ఆదివాసి పల్లెలకు ఇంకా రవాణా సౌకర్యం కలగడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి.

ఏళ్ల తరబడి వాగులపై వంతెనలు నిర్మించాలని గిరిజనులు కోరుతున్న ప్రభుత్వం పాలకులు పట్టించుకోవడం లేదు. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు అటవీ చట్టాల అడ్డుకున్న గిరిజన గ్రామాల రైతులకు శాపంగా మారుతుంది. ఖానాపూర్ నియోజకవర్గం లోని మారుమూల గిరిజన గ్రామాలకు నేటికీ రవాణా సదుపాయం వర్షాకాలంలో ఎండమావి గాని మిగులుతుంది 

ఆదివాసీలకు తప్పని ఇక్కట్లు 

ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు ఆదివాసి గ్రామాలకు నేటికీ రోడ్డు మార్గం ఉన్న వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలం ఇక్కట్లు తప్పడం లేదు. కడెం ఖానాపూర్ ఎంబి దస్తురాబాద్, uట్నూర్ మండలంలోని అనేక గ్రామాలకు గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పొంగి ప్రవించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కానాపూర్ మండలంలోని రెయిన్కొని వాగు ప్రతి ఏటా రోడ్డు మార్గం గండి పడుతుంది. వాగు దాటుతున్న ప్రజలు వరద నీటిని అంచనా వేయక మృత్యువాత పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ మహిళ ఇటువంటి ప్రమాదంలోని మృతి చెందింది.

అదేవిధంగా పెండి మండలంలోని దొంతి వాగు పసుపుల వాగు బ్రిడ్జిలు లేకపోవడంతో సుమారు 20 గిరిజన గ్రామాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. పసుపుల వాగుపై వంతెన నిర్మించిన మూడేళ్ల క్రితం భారీ వర్షాల కారణంగా అది కొట్టుకపోయింది. దీంతో మండలంలోని మండలంలోని సుమారు 20 గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధం ఎగిరిపోతుంది. ముఖ్యంగా గర్భిణీలు స్కూల్ కెళ్లే పిల్లలు వృద్దులు అత్యవసర పరిస్థితిలో బయటకు రావాల్సి వస్తే తాళ్లు మగ మనుషుల సహాయంతో వాగు దాటించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని గిరిజన గ్రామాల ప్రజలు తెలిపారు.

కడెం దస్తూరాబాద్ మండలంలోని అనేక గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు. మూడు నెలపాటు గిరిజన గ్రామాలు వణుకుతున్నాయి. ప్రతి ఎన్నికలు పాలకులు గిరిజన గ్రామాలకు రోడ్లు కల్పిస్తామని, నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఆచరణ మాత్రం అమలు కావడంలేదని గిరిజనవాసులు చెప్తున్నారు. వర్షాకాలంలో కనీసం ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో ఏదైనా అనుకోని ప్రమాదం జరుగుతే దేవుడిపై ప్రారంభిస్తున్నామని డివిజన్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి వంతెనను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.