1 August, 2026 | 5:53 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

‘అగ్నివీర్’లుగా ఎంపికైన యువకులకు సన్మానం

08-06-2026 12:00 AM

ముకరంపుర, జూన్ 7 (విజయక్రాంతి): ‘ఫిట్నెస్ ఫ్రీక్స్’ ఆధ్వర్యంలో భారత సైన్యంలో ’అగ్నివీర్’లుగా ఎంపికైన కరీంనగర్ యువకులను సన్మానించారు .ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై దేశ రక్షణ కోసం సైన్యంలో అడుగుపెడుతున్న యువకులను మరియు ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను  ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం అగ్నివీరులుగా ఎంపికైన యువకులను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారికి జ్ఞాపికలను అందజేశారు. యువత క్రమశిక్షణతో అంకితభావంతో దేశ సేవలో భాగస్వామ్యం కావడం కరీంనగర్ ప్రాంతానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,ఫిట్నెస్ ఫ్రీక్స్ నిర్వాహకులు సురేష్  ఎంపికైన యువకుల తల్లిదండ్రులు,స్థానిక యువకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.