కుమ్మరుల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలి
అఖిల భారతీయ శాలివాహన ప్రజాపతి కుంభకర్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద్ ప్రజాపతి
ముషీరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): తెలంగాణ కుమ్మర శాలివాహన కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ను తెలంగాణ కుమ్మర శాలివాహన కార్పొరేషన్ గా మార్చి పాలకమండలిని నియమించి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మిరుదొడ్డి శివానంద్ ప్రజాపతి, రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి సిలివేరు శంకర్ ప్రజాపతి, ప్రధా న కార్యదర్శి దొమ్మాట నాదం ప్రజాప్రతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో అఖి ల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహా సంఘ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కుమ్మర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ కుమ్మర్ల నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మర్ల ఆత్మగౌరవ భవనం కొరకు ఉప్పల్ భగత్‌లో కేటాయించిన మూడు ఎకరాల స్థలంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా మూడు కోట్ల రూపాయలు వెంటనే కేటాయించి భవన నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
కుమ్మర్ల రిజర్వేషన్ కేటగిరీని బీసీ ’బీ’ బీసీ ’ఏ’ లోకి మార్చాలన్నా రు. గ్రామ దేవతల ఆలయాలలో కుమ్మర్లనే పూజారులుగా నియమించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాకు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవునూరి రామమూర్తి, మళ్లికంటి వీరన్న, రాష్ట్ర కార్యదర్శి దామెర వెంకటేష్‌తో పాటు సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు.






