కారు బ్లాస్ట్.. వ్యక్తికి గాయాలు
మునిపల్లి,(విజయక్రాంతి): కారు టైర్ బ్లాస్ట్ అయి పక్కనున్న ఓ వ్యక్తి తగిలడంతో తీవ్ర గాయాలైన సంఘటన కంకోల్ గ్రామం ముంబాయి జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్ఐ అరవింద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయికోడ్ మండల ఔరంగనగర్ గ్రామానికి చెందిన బేగరి నర్సింలు అనే వ్యక్తి ఆర్ ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే పని నిమిత్తం సోమవారం సదాశివపేటకుతన బైక్ పై వెళ్తున్న క్రమంలో మునిపల్లి మండలం కంకోల్ గ్రామ సమీపంలోని గల ప్లై ఓవర్ (ఉన్న సర్వీస్ రోడ్డు) వద్దకు రాగానే బీదర్ నుంచి అతి వేగంగా అజాగ్రత్తగా.. వస్తున్న కారు టైర్ బ్లాస్ట్ అయింది. దీంతో పక్కనున్న దరికేడును ఢీకొనగా దరికేట్ ఎగిరిపోయి నర్సింలు బైక్ ను బలంగా ఢీకొనడంతో తలకు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 వాహనంలో సంగారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్సపొందుతున్నట్లు ఎస్ఐ అరవింద్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.






